LOADING...
Virat Kohli: వికెట్‌ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్‌.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్‌ ఫిదా
వికెట్‌ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్‌.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్‌ ఫిదా

Virat Kohli: వికెట్‌ తీసిన బౌలర్‌కే ఆటోగ్రాఫ్‌.. విరాట్ కోహ్లీ పెద్దమనసుకు ఫ్యాన్స్‌ ఫిదా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన వెంటనే దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. విజయ్‌హజారే ట్రోఫీలో దిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లీ తొలి మ్యాచ్‌లోనే ఆంధ్రా జట్టుపై శతకంతో (131 పరుగులు; 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశాడు. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ అర్ధశతకం (77 పరుగులు; 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) సాధించి తన క్లాస్‌ను మరోసారి చాటాడు. ఈ మ్యాచ్‌లో దిల్లీ 7 పరుగుల తేడాతో గెలుపొందగా.. విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

Details

విశాల్ జైస్వాల్‌కు బంతిపై ఆటోగ్రాఫ్

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కోహ్లీని స్పిన్నర్ విశాల్ జైస్వాల్ అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. ముందుకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ బంతిని మిస్ చేయగా.. వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ చురుకుగా స్పందించి స్టంపౌట్ చేశాడు. ఈ వికెట్‌ మ్యాచ్‌లో కీలక మలుపుగా మారింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ తన స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ను మరోసారి నిరూపించాడు. తన వికెట్ తీసిన విశాల్ జైస్వాల్‌కు బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చి, అతడితో కలిసి ఫొటో దిగాడు.

Details

 గ్రేట్‌ఫుల్ మూమెంట్స్ అంటే క్యాప్షన్

ఈ ఫొటోలను జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. "టీవీలో అతడి ఆటను చూసిన దశ నుంచి.. అతడితో మైదానం పంచుకున్న వరకూ.. ఇవి నిజంగా గ్రేట్‌ఫుల్ మూమెంట్స్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. కొంతమంది అభిమానులు కోహ్లీని ప్రశంసిస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు వికెట్ తీసిన తర్వాత సెలబ్రేట్ ఎందుకు చేశావు? అంటూ జైస్వాల్‌ను ప్రశ్నించారు. ఇంకొందరు మాత్రం అద్భుతమైన బంతితో కోహ్లీని ఔట్ చేసినందుకు అతడిని అభినందించారు. ఈ పోస్ట్‌కు కొన్ని గంటల్లోనే 53 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. అలాగే కోహ్లీ వికెట్ తీసిన బౌలింగ్ వీడియోను కూడా జైస్వాల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా..దానికి ఏకంగా 2.7మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Advertisement