LOADING...
Virat Kohli : విరాట్ ఇప్పటివరకూ టచ్ చేయని సచిన్ రికార్డులివే!
విరాట్ ఇప్పటివరకూ టచ్ చేయని సచిన్ రికార్డులివే!

Virat Kohli : విరాట్ ఇప్పటివరకూ టచ్ చేయని సచిన్ రికార్డులివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రాంచీలో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ ఆడిన 135 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఫ్యాన్స్‌కి పండగ చేసింది. ఈ ఇన్నింగ్స్ కేవలం భారత జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి దాటించడమే కాదు...ఇప్పటికే ఉన్న గణాంకాల పోరులో కోహ్లీ ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ఈ శతకంతో కోహ్లీ వన్డేల్లో 52 సెంచరీలు, మొత్తంగా 83 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఒకప్పుడు కేవలం సచిన్ టెండూల్కర్‌కే సాధ్యమని భావించిన అనేక రికార్డులపై ఇప్పుడు కోహ్లీ బలం చూపిస్తున్నాడు. సచిన్ రికార్డులు అంటే ఒక మహా శిఖరం లాంటివి. ఆ పర్వతాన్ని పూర్తిగా జయించడం ఎవరికైనా కష్టమే. అయితే కోహ్లీ ఇప్పటికే ఏ ఏ రికార్డులను బద్దలు కొట్టాడు? ఇంకా ఏ రికార్డులు అందుకోలేదో ఇప్పుడు చూద్దాం

Details

 కోహ్లీ దాటేసిన సచిన్ రికార్డులు 

వన్డే సెంచరీల రికార్డు సచిన్ చేసిన 49 సెంచరీలను దాటి కోహ్లీ ఇప్పుడు 52 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు టెస్టుల్లో సచిన్ చేసిన 51 సెంచరీలు కూడా కోహ్లీ వన్డే సెంచరీల సంఖ్య (52) కంటే తక్కువ. ఈ రికార్డులో కూడా విరాట్ ముందంజలోనే ఉన్నాడు. ఛేజింగ్‌లో చక్రవర్తి ఛేజింగ్‌లలో అత్యధిక సెంచరీలు, విజయవంతమైన ఛేజింగ్‌ల్లో అత్యధిక పరుగులు, అలాగే స్వదేశంలో వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు కోహ్లీ పేరిటే ఉన్నాయి. స్పీడ్ రికార్డులు వన్డేల్లో 8,000 నుండి 14,000 పరుగుల వరకు—ప్రతి మైలురాయిని అత్యంత వేగంగా చేరిన బ్యాట్స్‌మన్ కోహ్లీ. ఈ విభాగంలో సచిన్ స్పీడ్‌ను విరాట్ దాటేశాడు.

Details

 ప్రపంచకప్ రికార్డు 

2023 వరల్డ్ కప్‌లో కోహ్లీ చేసిన 765 పరుగులు—2003 వరల్డ్ కప్‌లో సచిన్ చేసిన 673 పరుగుల రికార్డును బద్దలు కొట్టాయి. సచిన్ దగ్గరే ఇంకా సురక్షితంగా ఉన్న రికార్డులు కెరీర్ మొత్తం పరుగులు 34,357 అంతర్జాతీయ పరుగులతో సచిన్ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ మాత్రం ప్రస్తుతం 27 వేలు దాటిన దశలో ఉన్నాడు. టెస్టులు: సచిన్ 15,921 పరుగులు వన్డేలు: 18,426 పరుగులు జో రూట్, కోహ్లీ దగ్గరలో ఉన్నా, ఈ రికార్డులు త్వరగా బద్దలయ్యేలా కనిపించడం లేదు.

Advertisement

Details

అందుకోలేని రికార్డులివే

463 వన్డేలు 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రపంచ కప్‌లో 2,278 పరుగులు వన్డేల్లో 62 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అన్ని ఫార్మాట్లలో 76 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఈ భారీ సంఖ్యలతో సచిన్ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నాడు. అవార్డుల పోరులో కోహ్లీ వేగంగా దూసుకెళ్తున్నాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ప్రదర్శన కొనసాగితే, అన్ని ఫార్మాట్లలో సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రికార్డులను అధిగమించే ఛాన్స్ ఉంది. వన్డేలు, ఛేజింగ్‌ల వంటి కీలక విభాగాల్లో సచిన్ రికార్డులను కోహ్లీ ఇప్పటికే దాటేశాడు. ఇంకా కొన్నింటిని కూడా సాధించే అవకాశముంది.

Advertisement