Virat Kohli: 1.5 బిలియన్ అభిమానుల కోరిక అదే.. కోహ్లీ రిటైర్మెంట్‌పై సిద్ధూ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి రావాలని కోరుతూ భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సిద్ధూ.. ''దేవుడు నాకు వరం ఇచ్చి ఏదైనా కోరుకోమంటే.. కోహ్లీ తన టెస్టు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని మళ్లీ టెస్టులు ఆడేలా చేయమని అడుగుతాను. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు. 20 ఏళ్ల యువకుడిలా విరాట్ ఫిట్‌నెస్ ఉంది. అతను 24 క్యారెట్ల బంగారం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.
Details
ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ
ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 74 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో శతకాలు సాధించాడు. ఈ ఏడాది మొత్తం 13 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 651 పరుగులు నమోదు చేశాడు. ఇక 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన 'కింగ్ కోహ్లీ'.. ఆంధ్రప్రదేశ్‌పై 101 బంతుల్లో 131పరుగులతో శతకం బాదగా, గుజరాత్‌తో మ్యాచ్‌లో 77 పరుగులు చేశాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కూడా విరాట్ కోహ్లీ పాల్గొననున్నాడు.