LOADING...
IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌పై రోహిత్-విరాట్ ఫోకస్‌.. రాంచీలో ప్రాక్టీస్ షూరూ!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌పై రోహిత్-విరాట్ ఫోకస్‌.. రాంచీలో ప్రాక్టీస్ షూరూ!

IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌పై రోహిత్-విరాట్ ఫోకస్‌.. రాంచీలో ప్రాక్టీస్ షూరూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాంచీ వేదికగా నవంబర్‌ 30, ఆదివారం టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందుగానే భారత జట్టు రాంచీకి చేరుకుని ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో శ్రమించుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే టీ20లు, టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రో-కో ద్వయం ప్రస్తుతం పూర్తిగా వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించారు. ఇద్దరూ కలిసి 2027 వన్డే వరల్డ్‌కప్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ పరిస్థితి పూర్తిగా విఫలమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. కోల్‌కతా టెస్ట్‌ను 30 పరుగుల తేడాతో కోల్పోయిన భారత్‌, గువాహటి టెస్ట్‌లో 408పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

Details

వన్డే సిరీస్ కైవసం చేసుకోవడానికి ప్లాన్

రన్స్‌ పరంగా ఇదే భారత జట్టు చరిత్రలో అత్యంత పెద్ద పరాజయం. అంతేకాదు 25 సంవత్సరాల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్ట్‌ సిరీస్‌ భారత్‌ ఓడిపోవడం ప్రత్యేకం. ఈ నేపథ్యంతో రోహిత్‌, కోహ్లీలు వన్డేల్లో రాణించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆసీస్‌ పర్యటనలో రోహిత్‌ సెంచరీతో ఆకట్టుకోగా, కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయినప్పటికీ మూడో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీతో ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో గాయపడ్డ శుభ్‌మన్‌ గిల్‌ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రిషభ్‌ పంత్ కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Details

సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు 

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్‌కీపర్), రిషభ్ పంత్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, నితీశ్‌కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్. వన్డే సిరీస్ షెడ్యూల్ తొలి వన్డే - నవంబర్ 30, రాంచీ రెండో వన్డే - డిసెంబర్ 3, రాయ్‌పూర్ మూడో వన్డే - డిసెంబర్ 6, విశాఖపట్నం

Advertisement