LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య 
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి దారుణ హత్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
07:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. దీపు చంద్ర దాస్ ఘటన తర్వాత, తాజాగా అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్‌పై గుంపుగా దాడి చేసి ప్రాణాలు తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల అమృత్ మండల్‌ను తీవ్రంగా కొట్టడంతో అతడు మృతి చెందినట్లు సమాచారం. ఈ దారుణ ఘటన రాజ్‌బరి జిల్లాలో జరిగింది. పాంగ్షా మోడల్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించారు. స్థానికులు అమృత్ మండల్ దోపిడీ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు.

వివరాలు 

'సామ్రాట్ వాహిని' అనే స్థానిక గ్యాంగ్‌కు అమృత్ మండల్‌  నాయకత్వం 

పోలీసుల వద్ద ఉన్న వివరాల ప్రకారం, అమృత్ మండల్ 'సామ్రాట్ వాహిని' అనే స్థానిక గ్యాంగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం చిట్టగాంగ్ సమీపంలోని రౌజన్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబానికి చెందిన ఇల్లు దగ్ధమైంది. గత ఐదు రోజుల వ్యవధిలో రౌజన్ ప్రాంతంలో మొత్తం ఏడు హిందూ కుటుంబాల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement