BCCI: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తప్పు.. బీసీసీఐ నిర్ణయానికి మదన్‌లాల్ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడి స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను ఐపీఎల్ 2026 కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని బీసీసీఐ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు కేకేఆర్ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి అధికారికంగా విడుదల చేసింది. ఈ అంశంపై బీసీసీఐ వేగంగా స్పందించి తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు సమర్థిస్తూ బోర్డుకు మద్దతుగా నిలుస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన భారత మాజీ కెప్టెన్ మదన్ లాల్.. ఈ విషయంలో బీసీసీఐ తీసుకున్న చర్యలు సరైనవేనని అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, అన్ని కోణాల్లో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకు వెళ్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.
Details
బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలి
ఈ వ్యవహారంలో వారికి ప్రభుత్వ స్థాయి నుంచి కూడా సూచనలు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితిని బోర్డు పూర్తిగా అర్థం చేసుకుంది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్ర రావడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. అలాంటి దేశంలో మన హిందూ సోదరులపై దాడులు జరగడం చాలా దురదృష్టకరం.దీనిపై బంగ్లాదేశ్ ప్రజలు ఆలోచించాలని మదన్ లాల్ వ్యాఖ్యానించారు. ఇక మరో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా బీసీసీఐ తీసుకున్న వేగవంతమైన నిర్ణయాన్ని ప్రశంసించారు. ముస్తాఫిజుర్ విషయంలో బోర్డు ఎలాంటి తప్పు చేయలేదు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏమాత్రం మంచివి కావు. బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా, ముందుగా విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపే నిర్ణయం తీసుకుంటుందని అజారుద్దీన్ స్పష్టం చేశారు.