LOADING...
T20 World Cup: భారత్‌లో ఆడమంటారా? ఐసీసీకి బంగ్లా బోర్డు కీలక ప్రతిపాదన.. ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్!
భారత్‌లో ఆడమంటారా? ఐసీసీకి బంగ్లా బోర్డు కీలక ప్రతిపాదన.. ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్!

T20 World Cup: భారత్‌లో ఆడమంటారా? ఐసీసీకి బంగ్లా బోర్డు కీలక ప్రతిపాదన.. ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ జట్టు నుంచి డ్రాప్ చేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో మ్యాచ్‌లు ఆడితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో జరగనున్న తమ అన్ని టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను వేరే దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ను కోరింది.

Details

భారత్ కు రావడానికి మేము సిద్ధంగా లేము

భద్రతా కారణాలను చూపుతూ భారత్‌కు రావడానికి తాము సిద్ధంగా లేమని బంగ్లా బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. శనివారం ఐసీసీతో జరిగిన సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. తమ గ్రూప్‌ను ఐర్లాండ్ గ్రూప్‌తో మార్పిడి చేయాలని ఐసీసీని కోరింది. బంగ్లాదేశ్ తమ అన్ని గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం విడుదలైన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి.

Details

షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవు

అయితే బంగ్లాదేశ్ ప్రతిపాదనపై క్రికెట్ ఐర్లాండ్ (CI) స్పందించింది. తమ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టంగా ప్రకటించింది. షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందనే విషయంపై తమకు స్పష్టమైన హామీలు లభించాయని, గ్రూప్ దశలో ఐర్లాండ్ ఆడే అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే జరుగుతాయని ఐర్లాండ్ అధికారి వెల్లడించారు. ఐర్లాండ్ షెడ్యూల్ మారదని తేల్చి చెప్పడంతో, ఇప్పుడు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్ జట్లు గ్రూప్ Bలో ఉన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్ వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్ జట్లతో కలిసి గ్రూప్ Cలో కొనసాగుతోంది.

Advertisement