LOADING...
Tamim Iqbal: తమీమ్‌ ఇక్బాల్‌ 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ ఆరోపణలు.. బీసీబీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు!
తమీమ్‌ ఇక్బాల్‌ 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ ఆరోపణలు.. బీసీబీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు!

Tamim Iqbal: తమీమ్‌ ఇక్బాల్‌ 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ ఆరోపణలు.. బీసీబీ సభ్యుడి సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ (BCB) సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించాడు. తమీమ్‌ను 'ఇండియన్‌ ఏజెంట్‌' అంటూ నజ్ముల్‌ ఇస్లామ్‌ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక వేదికగా ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జరగనుంది. అయితే భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీసీబీ, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని కోరుతూ ఐసీసీకి మెయిల్‌ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఐసీసీ ఇప్పటివరకు అధికారిక స్పందన ఇవ్వలేదు.

Details

తీవ్ర స్థాయిలో స్పందించిన నజ్ముల్‌ ఇస్లామ్

ఈ పరిణామాలపై స్పందించిన బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ సంయమనం పాటించాలని సూచించాడు. 'మన ఆదాయంలో 90 నుంచి 95 శాతం వరకు ఐసీసీ నుంచే వస్తోంది. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశాల్లో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి' అని వ్యాఖ్యానించాడు. తమీమ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై బీసీబీ సభ్యుడు నజ్ముల్‌ ఇస్లామ్‌ తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన ఆయన, 'ఈసారి నజ్ముల్‌ ఇస్లామ్‌ ఇండియన్‌ ఏజెంట్‌ అని బంగ్లాదేశ్‌ మొత్తానికి నిరూపితమైంది' అంటూ ఆరోపణలు చేశాడు. అయితే తన వ్యాఖ్యలపై మరింత స్పష్టత ఇస్తూ తమీమ్‌ ఇక్బాల్‌ మరోసారి స్పందించాడు. 'నాకు ప్రస్తుతం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో ఎలాంటి సంబంధం లేదు.

Details

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ భవిష్యత్తే ముఖ్యం

అందుకే సాధారణ పౌరుడిలాగే మీడియా ద్వారా మాత్రమే విషయాలను తెలుసుకుంటున్నాను. నా వద్ద పూర్తి సమాచారం లేదు కాబట్టి ఎక్కువగా వ్యాఖ్యలు చేయకూడదనుకుంటున్నానని తెలిపాడు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించాడు. 'చర్చల ద్వారా పరిష్కారం కనుగొంటే అంతకంటే మంచిదేమీ లేదు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో బహిరంగ వ్యాఖ్యలు చేసేముందు బీసీబీ అంతర్గతంగా చర్చించుకోవాలి. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ భవిష్యత్తే అన్నింటికన్నా ముఖ్యం. మన ఆదాయంలో 90 నుంచి 95 శాతం వరకు ఐసీసీ నుంచే వస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు ఏది మేలు చేస్తుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని తమీమ్‌ ఇక్బాల్‌ స్పష్టం చేశాడు.

Advertisement