LOADING...
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో బంగ్లా ఔట్‌? స్కాట్లాండ్‌ ఎంట్రీ దాదాపు ఖరారేనా!
టీ20 వరల్డ్‌కప్‌ 2026లో బంగ్లా ఔట్‌? స్కాట్లాండ్‌ ఎంట్రీ దాదాపు ఖరారేనా!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో బంగ్లా ఔట్‌? స్కాట్లాండ్‌ ఎంట్రీ దాదాపు ఖరారేనా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భద్రతా కారణాలను చూపిస్తూ భారత్‌లో జరిగే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ 2026 మ్యాచ్‌లకు హాజరుకామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేసింది. తమ జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాల్సిందేనని బీసీబీ పట్టుబడుతోంది. అయితే ఈ ప్రతిపాదనలను ఐసీసీ (ICC) పూర్తిగా తిరస్కరించింది. మెగా టోర్నమెంట్‌లో పాల్గొనాలా? లేక వైదొలగాలా? అనే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని బీసీబీకి ఐసీసీ 24 గంటల గడువు విధించింది. ఆ గడువు ముగిసినా, ఇప్పటివరకు బీసీబీ అధికారికంగా తన తుది నిర్ణయాన్ని ఐసీసీకి తెలియజేయలేదని ఓ క్రీడా ఛానల్ వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్త టీ20 వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగినట్టేనని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Details

స్కాట్లాండ్‌కు అవకాశం లభించే అవకాశం

ఒకవేళ బంగ్లా తప్పుకుంటే ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు అవకాశం లభించే సూచనలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్కాట్లాండ్ ఎంపిక కేవలం లాంఛనమేనని తెలుస్తోంది. అయితే దీనిపై ఐసీసీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై స్పందించిన బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడారు. భారత్‌లో మా జట్టుకు భద్రతా ముప్పు ఉందని మేం భావిస్తున్నాం. ఐసీసీ రూపొందించిన ముప్పు అంచనా నివేదిక మాకు ఆమోదయోగ్యంగా లేదు. అయినప్పటికీ ప్రపంచకప్‌లో ఆడాలనే ఆశను వదులుకోలేదు.

Details

ముంబయిలో మూడు మ్యాచులు

భద్రత అంశాన్ని వాస్తవికంగా పరిగణలోకి తీసుకుని, శ్రీలంకలో మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ దశలో భారత్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబయిలో జరగాల్సి ఉంది. ఇక మరోవైపు బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం దక్కుతుందన్న వార్తలపై స్పందించేందుకు ఆ జట్టు క్రికెట్ కమ్యూనికేషన్ హెడ్ చార్లెస్ పీటర్సన్ నిరాకరించారు. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే మా వెబ్‌సైట్ ద్వారా ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ఐసీసీ తుది నిర్ణయం కోసం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Advertisement