LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు.. 
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు..

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకొని, మతోన్మాదులుక్రూరమైన హింసకు పాల్పడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. ఖోకన్ దాస్ అనే 50 ఏళ్ల వ్యక్తి హింసాత్మక దాడికి గురయ్యాడు. అతడిని కొట్టి, నిప్పంటిస్తూ హత్య ప్రయత్నం చేశారు. ఈ దాడి డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో జరిగింది. దాస్ తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక గుంపు పదునైన ఆయుధాలతో దాడి చేసి, అతడిని గాయపరిచింది. దాస్ తన ఇంటికి వెళ్తుండగా, ఒక పెద్ద మూక అతడిపై కత్తులతో దాడి చేసింది.

వివరాలు 

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన నాల్గవ దాడి

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన ఇది నాల్గవ దాడి. డిసెంబర్ 18న మైమన్‌సింగ్ జిల్లాలో, వస్త్రకర్మాగారంలో పని చేస్తున్న దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని నకిలీ ఆరోపణలపై దారుణంగా కొట్టి హతమార్చి, రోడ్డు పక్కన చెట్టుకు నగ్నంగా వేలాడదీసి నిప్పంటించి కాల్చారు. ఆ తర్వాత డిసెంబర్ 25న, కాలిమోహర్ యూనియన్‌లోని హుస్సేన్‌దంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మోండల్ అనే హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపారు. అదే క్రమంలో మైమన్‌సింగ్ జిల్లాలోని మరో వస్త్రకర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి హతమార్చాడు.

Advertisement