LOADING...
BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు
బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు

BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బయో ఆసియా-2026 సదస్సు సందర్భంగా మంగళవారం తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి. హైటెక్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.1,700 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, వచ్చే రెండేళ్లలో దాదాపు 8,250 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అందనున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ సంస్థ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ సంస్థ 'ఒపెల్లా హెల్త్‌కేర్' తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించనున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

వచ్చే ఏడాదిలోపు సుమారు 500 ఉద్యోగాలు 

42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విస్తరణ జరగనుండగా, వచ్చే ఏడాదిలోపు సుమారు 500 ఉద్యోగాలను కల్పించనుంది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఛైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తినాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ సంస్థలు తమ ఇన్నోవేషన్ కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్‌ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు 

ప్రాజెక్ట్ ద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు

ఇదే సమయంలో, ఇండోనేసియాకు చెందిన జీఏపీఎఫ్‌ఏ గ్రూప్‌కు అనుబంధ సంస్థ అయిన 'వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్' జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక బీఎస్‌ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ కేంద్రంలో కోళ్లతో పాటు పశువులు, పందులు, ఆక్వాకల్చర్ రంగానికి అవసరమైన వ్యాక్సిన్ల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగంలో పేరొందిన 'ట్రెడెన్స్ ఇంక్' కూడా హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ సేవల కోసం రూ.300 కోట్ల పెట్టుబడితో 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

Advertisement

వివరాలు 

రాబోయే 2-3 ఏళ్లలో మరో 2,000 మందికి ఉపాధి అవకాశాలు

ఈ కేంద్రం ద్వారా ప్రపంచ స్థాయి కార్యకలాపాలు నిర్వహించనుండగా, ప్రారంభ దశలోనే 400 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో మరో 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికను సంస్థ ప్రకటించింది. భారత లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో 'ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్' సంస్థ జీనోమ్ వ్యాలీలో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ క్యాంపస్‌లో సుమారు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే ఆరు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించనుండగా,మొత్తం 5,000మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

Advertisement