LOADING...
ICC: జనవరి 21లో ఐసీసీ డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుందా?
జనవరి 21లో ఐసీసీ డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుందా?

ICC: జనవరి 21లో ఐసీసీ డెడ్‌లైన్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 వరల్డ్ కప్ 2026 నాటి వేదికల వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి (ICC) విన్నవించిన విషయం తెలిసిందే. అయితే మెగాటోర్నీకి మరింత తక్కువ సమయం ఉన్నందున, వేదికల మార్పు సాధ్యం కాదని ఐసీసీ బీసీబీ (BCB)తో మరోసారి స్పష్టంగా తెలియజేసింది. తాజా సమాచారం ప్రకారం ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డుకు జనవరి 21ను డెడ్‌లైన్‌గా పెట్టింది. ఈ డెడ్‌లైన్‌కు బీసీబీ స్పందించకుంటే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు వర్డ్ కప్ మ్యాచ్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం వేదికలను మార్చడం అసాధ్యమని ఐసీసీ చెబుతోంది.

Details

అధికారిక డెడ్ లైన్

దీనికి భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ, బంగ్లాదేశ్ తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఐసీసీ భారత వేదికల్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేను అని హామీ ఇచ్చింది. ఢాకా సమావేశంలో ఈ డెడ్‌లైన్‌ను అధికారికంగా నిర్ధారించడం జరిగింది. ఈ వారంలో రెండు సార్లు ఐసీసీ, బీసీబీ మధ్య చర్చలు జరిగినా, భారత్‌లో మ్యాచ్‌లు ఆడటం సులభం కాదని బంగ్లాదేశ్ వాదించిందని 'EASPN Crick Info' పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, జనవరి 21 వరకు బీసీబీ భారత్‌ వేదికపై మ్యాచ్‌లు ఆడటానికి ఒప్పుకోకపోతే, ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉంది.

Details

క్రికెట్ వర్గాలు సస్పెన్స్

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం 'స్కాట్లాండ్' జట్టు ఆ ప్రత్యామ్నాయ ఛాన్స్‌ను పొందే అవకాశంలో ఉంది. ఈ వ్యవహారం టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ప్రభావితం చేసే కీలక టర్నింగ్ పాయింట్‌గా మారింది, ఫిబ్రవరి ప్రారంభానికి ముందు పరిస్థితులు ఎలా పరిష్కారమవుతాయో ఫ్యాన్స్, క్రికెట్ వర్గాలు సస్పెన్స్‌తో ఎదురుచూస్తున్నాయి.

Advertisement