తదుపరి వార్తా కథనం
BCCI: ఆ బంగ్లాదేశ్ ప్లేయర్‌ని వదిలేయండి : బీసీసీఐ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 03, 2026
11:08 am
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరిగిన వరుస దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో, కేకేఆర్ టీమ్‌కి ముస్తాఫిజుర్‌ను వదిలివేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాడిని ఎంచుకోవడంపై వచ్చిన వ్యతిరేకతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.