Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు కేంద్రం నుండి నిధుల విడుదల కేవలం నామమాత్రంగా మాత్రమే ఉందని, ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రూ.21,636 కోట్లు రావాల్సి ఉన్నా, తొలిరోజుల్లో (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) రూ.4,634 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి, అంటే సుమారు 21% మాత్రమే.
ఈ నిధుల కొరత వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడికి గురైంది. సంక్షేమ పథకాలు, పాత అప్పుల చెల్లింపులు, అభివృద్ధి పనులకు సంబంధించి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Details
రూ.450 కోట్లు మాత్రమే రిలీజ్
వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కోరినా కేంద్రం ఈ ఏడాది కేవలం రూ.450 కోట్లు విడుదల చేసింది.
కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్) నిధుల విషయంలో కూడా కేంద్రం పెద్దగా సహకరించడం లేదు. ముఖ్యంగా ఈ పథకాలకు 60% కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్రాలు తమ వాటా కింద 40% జమ చేస్తాయి.
అయితే, కొన్ని పథకాలలో కేంద్రం నిధులను తగ్గించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం, కొత్త బడ్జెట్‌లో కేంద్రం తరఫున అధిక నిధుల కేటాయింపును కోరుతూ, ఇప్పటికే కేంద్ర మంత్రులతో చర్చలు నిర్వహించింది.
ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులకు మరింత నిధులు కోరుతున్నారు.