Page Loader
Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 
వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

Textile sector: వస్త్ర రంగానికి ఊతమిచ్చే కొత్త పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రభుత్వం వస్త్ర రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగానికి సంబంధించి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక టెక్స్‌టైల్స్, అపెరల్స్, గార్మెంట్స్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, అలాగే రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 2014-29 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతులను 1 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించుకుంది. పరిశ్రమలను ఎంఎస్‌ఎంఈ, సబ్‌లార్జ్, లార్జ్, మెగా అనే నాలుగు కేటగిరీలుగా విభజించి, వాటికి అనుగుణంగా ప్రోత్సాహాలను ప్రకటించింది.

Details

వందశాతం స్టాంప్ డ్యూటీ

స్థిర మూలధన పెట్టుబడిపై 8-10% రాయితీ అందజేస్తారు. ఈ రాయితీని ఉత్పత్తి ప్రారంభం నుండి ఐదేళ్లపాటు సమాన వార్షిక వాయిదాల్లో చెల్లిస్తారు. పరిశ్రమల కోసం కొనుగోలు చేసే భూమిపై వందశాతం స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకాన్ని తిరిగి చెల్లిస్తుంది. ఇక మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించనుంది. రూ.200 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రాజెక్టు ప్రాముఖ్యత, ఉపాధి కల్పన ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్స్, అపెరల్స్, గార్మెంట్స్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల స్థాపనకు మద్దతు ఇస్తారు.

Details

ఎలక్ట్రిసిటీ డ్యూటీలో 50శాతం మినహాయింపు

సబ్‌లార్జ్, మెగా పరిశ్రమల కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుండి ఆరేళ్లపాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీలో 50శాతం మినహాయింపు ప్రకటించనుంది. స్థానికంగా ముడిపదార్థాలను సేకరించిన పరిశ్రమలకు వార్షిక టర్నోవర్‌లో 1% లేదా గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు రీయింబర్స్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమలకు మలుపు తిప్పనుంది.