Survey on Work From Home: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా కీలక అడుగు వేసింది.
ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా మార్చి 10 వరకు ఈ సర్వే కొనసాగనుంది.
ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న వారి వివరాలను సేకరించనుంది. ఈ సర్వే ద్వారా టెక్నికల్ స్కిల్స్, విద్యార్హతలు, ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం పొందనుంది.
ఈ డేటాను విశ్లేషించి, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆసక్తి ఉన్నవారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Details
వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ల ఏర్పాటుపై ఆసక్తి
అవసరమైతే ప్రత్యేక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశంపై కూడా పరిశీలిస్తోంది.
అందుకు అవసరమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, హై-స్పీడ్ ఇంటర్నెట్, తగిన వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ పెరిగింది. వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లి మిగతా రోజులు ఇంటి నుంచే పని చేసే సంస్కృతి పలు సంస్థల్లో కొనసాగుతోంది.
ఏపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడంతో పెట్టుబడిదారులను ఆకర్షించే చర్యలు తీసుకుంటోంది.
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, అందులో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకునేందుకు ఈ సర్వేను చేపట్టింది.