Bhubharati Bill: ధరణి వ్యవస్థలో మార్పులు.. భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకు పాటుపడుతుందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను సమీక్షించి, ఈ చట్టాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. లక్షలాది మంది ధరణితో సతమతవుతున్నారని, అర్థరాత్రి ప్రమోట్ చేసిన ధరణి వ్యవస్థ అనేక ఇబ్బందులను కలిగించిందని పేర్కొన్నారు.
లోపాలను సరిచేసేందుకు భూభారతి చట్టం
ఆర్వోఆర్ చట్టం-2020 లో కలిగిన లోపాలను సరిచేసేందుకు పూర్తి ప్రక్షాళన చేసామని, కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు, రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసిన వాటి గురించి కూడా కోర్టులకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. భూ యజమానికి తెలియకుండా భూమి లీజు చేసేందుకు నిపుణులు కూడా ప్రయోగం చేశారని, పేదల ఆవేదనను వినిపించే మార్గం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.