తదుపరి వార్తా కథనం

AP Govt: ఆశా వర్కర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 12, 2025
03:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. వారి సంక్షేమం దృష్ట్యా మూడు కీలక నిర్ణయాలు తీసుకొని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. ఈ నిర్ణయాల ప్రకారం మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు మంజూరు చేయబడనున్నాయి. ఆశా వర్కర్‌గా పనిచేయగల గరిష్ట వయసును 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. అదనంగా, సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే రూ. 5,000 చెల్లింపు చేయనున్నారు. గరిష్టంగా మొత్తం రూ.1,50,000 వరకు ఈ చెల్లింపు కొనసాగనుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత కల్పించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.