Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు!
మందుబాబులకు రాష్ట్ర శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం తాజాగా చీప్ లిక్కర్ ధరను రూ.99కే అందిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరో మూడు ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల ధరలు తగ్గించడానికి ముందుకొచ్చింది. కొత్తగా విడుదలైన ఉత్తర్వులు ప్రకారం రాయల్ ఛాలెంజ్ గోల్డ్ క్వార్టర్ ధర రూ.230 నుండి రూ.210కి తగ్గింది. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుండి రూ.840కి తగ్గింది. మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రూ.220 నుండి రూ.190కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుండి రూ.760కి తగ్గింది.
ఆనంద వ్యక్తం చేస్తున్న మందు బాబులు
అదే విధంగా యాంటిక్విటీ ఫుల్ బాటిల్ ధర రూ.1,600 నుండి రూ.1,400కు తగ్గింది. ఈ నిర్ణయంతో మందుబాబులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో మరికొన్ని బ్రాండ్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిసింది.