
TG Govt: వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటల పని.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని వేళల పరిమితులను తాజాగా సవరించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులు రోజుకు గరిష్ఠంగా 10 గంటల వరకు పని చేయవచ్చు. అయితే వారంలో మొత్తం పని గంటలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ పరిమితికి మించి పని చేయించినా, తప్పనిసరిగా ఓవర్‌టైమ్ (ఓటీ) వేతనం చెల్లించాల్సిందేనని పేర్కొంది.
Details
అరగంట విరామం కల్పించాలనే నిబంధన
ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రోజుకు 6 గంటల పని అనంతరం కనీసం అరగంట విరామం కల్పించాలనే నిబంధనను కూడా ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలంటోంది. విరామంతో కలిపి రోజుకు 12 గంటలకు మించిన పనిని ఏ విధంగా కూడా అనుమతించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దృష్ట్యా తీసుకున్న మార్పుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు, ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.