NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు
    తదుపరి వార్తా కథనం
    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు
    8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు

    Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 12, 2024
    01:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో దసరా సీజన్‌లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఇంట్లో మటన్, మద్యం ఉండడం అనివార్యంగా మారింది.

    సాంప్రదాయంగా, ఈ పండుగ సమయంలో మందు లేకుండా బండ్ల పండుగ జరగడం కష్టం, అందువల్ల దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

    గత ఐదు రోజుల్లో మద్యం విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతం పెరగడం విశేషం. గతేడాది దసరాతో పోలిస్తే, ఈ ఐదు రోజుల్లో మద్యం అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయన్నారు.

    Details

    దసరా సందర్భంగా జోరుగా అమ్మకాలు

    రాష్ట్రంలో రోజుకు సగటున రూ.124 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

    ప్రత్యేకంగా ఈ నెల 10న రూ.139 కోట్ల విలువైన మద్యం డిపోల నుండి వైన్‌షాపులకు తరలించినట్లు తెలుస్తోంది.

    ఒకే రోజు 2.35 లక్షల బీర్లు వైన్‌షాపులకు చేరాయి. ఏడాది కాలంలో ఇలాంటి స్థాయిలో బీరు అమ్మకాలు జరగడం రికార్డుగా చెబుతున్నారు.

    వాస్తవానికి సగటున రోజుకు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఈ అమ్మకాలు మరింత పెరిగాయి.

    ఐదు రోజుల సగటున రోజుకు 1.20 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    Details

    గతేడాదితో పోలిస్తే 6.55శాతం ఎక్కువ

    ఈ నెల 1 నుండి గణాంకాలను పరిశీలిస్తే, 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

    ఇందులో 8.37 లక్షల మద్యం కేసులు, 14.53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి.

    గతేడాది అక్టోబర్ 1 నుండి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే పది రోజుల్లో 6.55 శాతం మందుబాబులు పెరిగినట్లు ఈ గణాంకాలు చూపిస్తున్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్

    తెలంగాణ

    Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కోర్టు సీరియస్.. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే! రేవంత్ రెడ్డి
    HYDRA : బ్యాంకు లోన్ల విషయంలో హైడ్రా సంచలన నిర్ణయం భారతదేశం
    Job Guarantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ హామీ.. రేపటి నుంచి కొత్త అవకాశాలు  రేవంత్ రెడ్డి
    Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు! వాతావరణ శాఖ

    ప్రభుత్వం

    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు దిల్లీ
    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం సుప్రీంకోర్టు
    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు  తెలంగాణ
    తెలంగాణ బడిపిల్లలకు సీఎం అల్పాహారం కానుక.. అక్టోబర్ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025