
Annadata Sukhibhava: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త.. రూ.20వేలు ఎప్పుడిస్తుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలే అవుతోంది.
ఈ సమయంలోనే ప్రభుత్వ పథకాల అమలుపై విమర్శలు చేయడం తొందరగా అనిపించవచ్చు. కానీ కొన్ని పథకాలకు ప్రతేడాది లబ్ది చేకూర్చకపోతే, ఆ పథకాల ప్రయోజనం సస్పెన్స్‌లో పడుతుంది.
అలాంటి కీలక పథకాలలో ఒకటే 'అన్నదాత సుఖీభవ'. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతీ రైతుకు రూ.20,000 అందించాల్సి ఉంది.
కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000 కింద ఆర్థిక సాయం అందుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా ఇస్తామని హామీ ఇచ్చింది.
Details
మార్చిలో డబ్బు జమయ్యే అవకాశం
దీనికోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలోపు మొత్తం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.
ఇందుకోసం మొత్తం రైతులు 41.50లక్షల మంది వేచి యున్నారు. ఈ పథకానికి రూ.5,796 కోట్ల నిధులు అవసరమవుతాయి. ప్రస్తుతానికి రూ.4,500 కోట్లు కేటాయించారు.
ఈ లెక్కలో కొంత తేడా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తన హామీని నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్చి 31, 2025లోపు అన్నదాత సుఖీభవ అమలు పూర్తవుతుందని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు.
రైతుల పథకంతో పాటు, మరో ముఖ్యమైన పథకం 'తల్లికి వందనం'. ఈ పథకం కింద ప్రతీ విద్యార్థి తల్లికి రూ.15,000 చొప్పున అందించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఈ పథకం అమలుపై స్పష్టత లేదు.
Details
తల్లికి వందనంపై రాని స్పష్టత
అయితే తల్లికి వందనం నమ్మి పేదవర్గాలు అప్పులు చేసి పిల్లలను చదివిస్తుండటం గమనార్హం. ప్రజలు కూటమి ప్రభుత్వంపై బలమైన ఆశలు పెట్టుకున్నారు.
ప్రభుత్వ హామీలను నమ్మి రైతులు, తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం హామీలు అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది