తదుపరి వార్తా కథనం
Telangana: బీర్ల ధరలు పెంచకపోవడంతో తెలంగాణకు సరఫరా నిలిపిన యూబీఎల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 08, 2025
05:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోయింది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడం వల్ల భారీ నష్టాలు వస్తున్నట్లు చెప్పి, యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈ నిర్ణయం తీసుకుంది.
బుధవారం యూబీఎల్ ప్రతినిధులు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను కలిసి, తమ బీర్ల సరఫరా తెలంగాణకు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఒక లేఖ అందజేశారు.
వారు పలుమార్లు ధరలు పెంచాలని కోరినా, ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల భారీ నష్టాలు ఎదురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.