LOADING...
Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌

Sunil kumar: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఐడీ మాజీ చీఫ్‌, ఐపీఎస్‌ అధికారి సునీల్‌ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అధికారిక అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అలాగే మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును వేధించిన కేసుకు సంబంధించి ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సేవా నిబంధనలు ఉల్లంఘన 2020 నుండి 2024 మధ్యకాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్‌ పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆలిండియా సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Details

విచారణ కమిటీ నివేదిక 

ఈ వ్యవహారంపై ప్రభుత్వం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం, అధికారికంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.