LOADING...
Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం
మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. తాజాగా రెండు కొత్త దగ్గు సిరప్‌లను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది. ఇప్పటికే 'కోల్డ్‌ రిఫ్‌' మందును పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం (DCA) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే విభాగం 'రిలీఫ్‌', 'రెస్పి ఫ్రెస్‌-TR' సిరప్‌లపై కూడా నిషేధం విధించింది. ఈ రెండు మందుల్లో కల్తీ పదార్థాలు ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో తేలడంతో వాటి విక్రయాలు, పంపిణీ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దగ్గు మందుల వినియోగంపై ప్రజారోగ్య విభాగం కూడా హెచ్చరికలు జారీ చేసింది.

Details

ప్రజారోగ్య శాఖ సూచనలివే

చిన్నారుల్లో సాధారణ దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు, ఇంటి వైద్య పద్ధతుల ద్వారా నివారణ సాధ్యమని తెలిపింది. ఎడాపెడా దగ్గు మందులు వాడడం చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరమని, ప్రాణహానికీ దారితీయవచ్చని హెచ్చరించింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు ఇవ్వకూడదు. ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, వైద్యుల సలహాతో దగ్గు మందులు వాడాలి. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అధికారులు స్పష్టం చేశారు.