APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వాట్సాప్ టికెట్ బుకింగ్.. కొత్త మార్గదర్శకాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఇకపై ఆర్టీసీ బస్ టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దూరప్రాంత బస్సులన్నింటికీ ఈ సదుపాయం వర్తిస్తుందని ఆర్టీసీ వెల్లడించింది.
క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిందిగా అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలు పంపినట్లు సమాచారం.
Details
వాట్సాప్‌లో టికెట్ బుక్ చేసుకోవడం ఇలా
1.9552300009 నంబర్‌కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి
2. అందుబాటులో ఉన్న సేవల లిస్ట్ వస్తుంది
3. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు ఎంపిక చేసుకోవాలి.
4. బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
5. అందుబాటులో ఉన్న బస్సులు, సీట్ల వివరాలు చూపిస్తాయి.
6. ఎంపిక చేసిన సీట్లకు డిజిటల్ చెల్లింపు చేసి బుకింగ్ పూర్తి చేయాలి.
7. వెంటనే టికెట్ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది.
ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు ఎక్కడి నుంచైనా సులభంగా టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది.
ప్రత్యక్షంగా బుకింగ్ కౌంటర్లకు వెళ్లే అవసరం లేకుండానే డిజిటల్ చెల్లింపులతో అనుకూలంగా బస్సు టికెట్లు పొందే అవకాశం లభిస్తుంది.