LOADING...
Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్‌ కోసం కోట్ల నిధుల విడుదల!
తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్‌ కోసం కోట్ల నిధుల విడుదల!

Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్‌ కోసం కోట్ల నిధుల విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వరి బోనస్ బకాయిల చెల్లింపుల కోసం అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించేందుకు రూ.514.36 కోట్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసిన రాష్ట్రవ్యాప్తంగా 2.17 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. అదనంగా, వరి బోనస్ చెల్లింపుల కోసం పౌరసరఫరాల సంస్థ మరో రూ.1,939.58 కోట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Details

ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్

వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడం, సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ ఇస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది కనీస మద్దతు ధర (MSP)కు అదనంగా అందించే మొత్తమని, బకాయిల చెల్లింపుతో రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement