Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
వివరాలు
వర్షాలు కురిసే అవకాశం
సముద్రంలో అలజడి పెరిగి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.
ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.