Page Loader
Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌
దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌

Delhi Pollution:దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2024
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు తీవ్రంగా క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ 400కు పైగా నమోదు అవుతోంది. ఈ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాయు కాలుష్యాన్ని అదుపులో పెట్టేందుకు 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది. కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, తద్వారా ప్రభుత్వ కార్యాలయాలు తగ్గిన శక్తితో పనిచేస్తాయని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అని తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ చర్యలను అమలు చేయడానికి సంబంధించి ఇవాళ సచివాలయ అధికారులతో సమావేశం జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Details

విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

దిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఇతర ప్రాంతాలలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. గాలి నాణ్యత సూచీ ఈ ఉదయం 422గా నమోదవడంతో, కొన్ని ప్రాంతాల్లో ఇది 500కి చేరిపోయింది. ఇప్పటికే పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య కారణంగా సుప్రీంకోర్టులో పలు కేసులు వర్చువల్ మోడ్‌లోనే విచారిస్తామని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. ఈ పరిస్థితిలో, కృత్రిమ వర్షం కురిపించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని గోపాల్ రాయ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.