Liquor Prices: ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ.. ఎంఆర్‌పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యం (IMFL) బాటిళ్ల ఎమ్మార్పీ (MRP) ధరకు సవరించిన చట్టాన్ని విడుదల చేసింది. కొత్తగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం మార్పులు చేసింది. చిల్లర ధరలు కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. దీని ప్రకారమే, ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ఎమ్మార్పీ రూ.150.50 ఉంటే అదనపు ప్రివిలేజ్ ఫీజు కారణంగా దాన్ని రూ.160కి పెంచనున్నారు.
విదేశీ మద్యం అమ్మకాలపై ప్రభావం
రాష్ట్ర గవర్నర్ ఆమోదం తీసుకున్న అనంతరం, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ కొత్త నోటిఫికేషన్‌ను గెజిట్ రూపంలో విడుదల చేశారు. ఈ చట్ట సవరణతో, రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా చిన్నచిన్న చిల్లర మార్పులు లేకుండా మద్యం ధరలు రౌండ్ ఫిగర్స్‌గా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.