TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్.. మార్చి 31 లోపు ఫైనల్ లిస్ట్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ విజయవంతంగా ప్రారంభమైంది. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాల్లోని గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి, కొందరికి ప్రోసీడింగ్స్ కాపీలను అందజేశారు.
అయితే స్కీమ్ ప్రారంభమైనా లబ్ధిదారులను ఎప్పటి నుంచి గుర్తిస్తారనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నా చాలామంది ఆశావాహులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
జనవరి 26న నారాయణపేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.
Details
ప్రతి సెగ్మెంట్‌లో 3,500 చొప్పున లబ్ధిదారుల గుర్తింపు
మార్చి 31లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్‌లో 3,500 చొప్పున లబ్ధిదారులను గుర్తిస్తామని ప్రకటించారు.
మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.22,500 కోట్ల ఖర్చు చేయాలని తెలిపారు.
ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనున్నారు.
అర్హత గల వారి వివరాలను అన్ని కోణాల్లో పరిశీలించి, లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నారు.
ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు, ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్దేశిస్తున్నారు.
ఈ ప్రక్రియలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ సంబంధంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.