తదుపరి వార్తా కథనం
Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 23, 2025
04:56 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం మద్యం బ్రాండ్లకు సంబంధించిన కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.
కొత్త కంపెనీలకు అవకాశం
ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందాయి. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్‌కు ఇదొక పెద్ద అవకాశంగా మారింది.
నాణ్యతకు సెల్ఫ్ సర్టిఫికేషన్
నూతన కంపెనీల నాణ్యత, ప్రమాణాల కోసం టీజీబీసీఎల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని అనుసరించనుంది.
ఆయా కంపెనీలు తమపై ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జత చేయాల్సి ఉంటుందని పేర్కొంది.