LOADING...
Suryakumar Yadav : టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. 150 సిక్స‌ర్ల‌ పూర్తి 
టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. 150 సిక్స‌ర్ల‌ పూర్తి

Suryakumar Yadav : టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌.. 150 సిక్స‌ర్ల‌ పూర్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 సిక్సర్ల మార్క్‌ను పూర్తి చేస్తూ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో ఈ ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో వచ్చిన మూడో బంతిని సిక్స్‌గా పంపి, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరాడు. ప్రస్తుతం ఈ విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును తన పేరుపై నిలబెట్టుకున్నాడు.

వివరాలు 

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే.. 

రోహిత్ తరువాత ముహమ్మద్ వసీం, మార్టిన్ గుప్టిల్‌, జోస్ బట్లర్‌లు ఇప్పటికే 150 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా వారిని అనుసరిస్తూ ఆ జాబితాలో చోటు సంపాదించాడు. రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) - 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు ముహమ్మద్ వసీం (యూఏఈ) - 91 మ్యాచ్‌ల్లో 187 సిక్స‌ర్లు మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) - 122 మ్యాచ్‌ల్లో 173 సిక్స‌ర్లు జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లాండ్) - 144 మ్యాచ్‌ల్లో 172 సిక్స‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌) - 91 మ్యాచ్‌ల్లో 150* సిక్స‌ర్లు

వివరాలు 

భారత్‌ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు

ఇక భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి భారత్‌ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (39 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్‌ (37 నాటౌట్‌; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త