Suryakumar Yadav: భారత జట్టు విజయానికి అతడే కీలకం : సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ (97*) అద్భుతంగా రాణించాడు. అతని కీలక ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. "మేం ఆడిన తీరు చూసి చాలా సంతోషంగా ఉంది. చావోరేవో తేల్చుకోవాల్సిన క్వార్టర్ ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో అందరూ అద్భుతంగా ఆడారు. ఓపికగా ఎదురుచూసిన మంచి మనుషులకు మంచే జరుగుతుంది. ఇదంతా సంజు శాంసన్ కష్టపడి పనిచేసిన ఫలితం. అతడు ఆడిన విధానమే జట్టుకు విజయాన్ని అందించిందని పేర్కొన్నాడు.
Details
తన ప్రభితను నిరూపించుకున్నాడు
బౌలర్ల ప్రదర్శనపై కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. మా బౌలర్లు ప్రణాళిక ప్రకారం బంతులు సంధించారు. బ్యాటర్లు కూడా చక్కగా ఆడారు. ముఖ్యంగా భాగస్వామ్యాలు కీలకమయ్యాయి. క్రికెట్‌లో ఒత్తిడి సహజం. కానీ అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా పరుగులు తీయాలి. ఒత్తిడి లేకుండా ఆనందం ఉండదని ఆయన చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ విఫలమయ్యాడు. దాంతో టీ20 వరల్డ్‌కప్ 2026 తుది జట్టులో స్థానం కోల్పోయి, కేవలం ఒకటి రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఆ అవకాశాల్లోనూ పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. అయితే వెస్టిండీస్‌పై మాత్రం తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
Details
'సంజు వరల్డ్ క్లాస్ ప్లేయర్' - గౌతమ్ గంభీర్
ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అతడిని ప్రశంసిస్తూ, "సంజు శాంసన్ ఓ వరల్డ్ క్లాస్ ఆటగాడు. అతడు ఎంత మంచి క్రికెటరో అందరికీ తెలుసు. అందుకే మేం అతడికి అండగా నిలిచాం. జట్టుకు అవసరమైన సమయంలో తన సామర్థ్యాన్ని చాటాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడి క్లాస్ కనిపించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా. సంజు శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా టీమ్ ఇండియాకు కీలక ఆటగాడు. భవిష్యత్తులో వీరిద్దరూ జట్టుకు మరింతగా ఉపయోగపడాలని అన్నారు. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ దిశగా మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది.