
Surya Kumar Yadav: భారత్‌కు పాక్ 'పోటీ'నే కాదు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్యకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 సూపర్-4లో దుబాయ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన భారత్-పాక్ మ్యాచ్‌ను ఇకపై 'పోటీ' అని పిలవడం మానేయాలని సూచించారు. విలేకర్ల సమావేశంలో ఓ సీనియర్ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఈ విషయం గురించి అడిగినప్పుడు, సూర్యకుమార్ నవ్వుతూ సర్, ఇకపై మీరు భారత్-పాక్ మ్యాచ్‌ను 'పోటీ' అని పిలవడం మానేయాలని స్పందించారు. సూర్యకుమార్ గణాంకాలను ఉదాహరిస్తూ, రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగినా స్కోరు 8-7 ఉంటే అది మాత్రమే పోటీ అని చెప్పారు.
Details
నవ్వుతూ వెళ్లిపోయిన కెప్టెన్
కానీ ఇక్కడ స్కోరు 12-3 లేదా 13-1 ఉన్నందున, ఇది ఏ విధంగానూ పోటీ కాదని స్పష్టంగా తెలిపారు. మీడియా సమావేశం తరువాత సూర్యకుమార్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. అలాగే సూర్యకుమార్ ఏ జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడుతుందో చూడటం ముఖ్యమని, మేము పాకిస్తాన్ కంటే మెరుగైన ఆటతీరు, ముఖ్యంగా బౌలింగ్‌లో ఆధిపత్యం చూపించామన్నారు. అభిమానులను అలరించడమే తమ లక్ష్యం అని, ఆటతోనే ఆకట్టుకుంటామని చెప్పారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, 7 నుంచి 15 ఓవర్లలో ఏ జట్టు బాగా ఆడితే ఆ జట్టే గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
Details
మా ప్రదర్శన అద్భుతంగా ఉంది
సూపర్-ఫోర్ దశలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (74) శుభ్‌మన్ గిల్ (47) చేసిన ప్రదర్శనపై కూడా సూర్యకుమార్ ప్రశంసలు కురిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ గురించి, "అతనికి ఏం చేయాలో తెలుసు, బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో అర్థం చేసుకుంటాడు. ఇది అతని ప్లస్ పాయింట్. ప్రతి మ్యాచ్‌లో అతను కొత్తగా నేర్చుకుంటున్నాడని తెలిపారు. సూపర్-ఫోర్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్‌కి వెళతాయి.