LOADING...
Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్‌ యాదవ్ 
ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్‌ యాదవ్

Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు… ఓటమికి పూర్తిగా నేనే బాధ్యుడు : సూర్యకుమార్‌ యాదవ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఘోర పరాజయం తర్వాత భారత టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దించాడు. జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే కాకుండా, బ్యాటింగ్ వైఫల్యాలు ఈ ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. తాను, శుభ్‌మన్‌ గిల్‌ బాధ్యత తీసుకుని జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ మాట్లాడుతూ మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ వికెట్‌ ఎలా ప్రవర్తిస్తుందన్న విషయం పూర్తిగా అర్థం కాలేదు.

Details

బ్యాటర్లు విఫలమయ్యారు

దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లు చూసిన తర్వాతే అసలు ప్లాన్ ఏంటో తెలిసింది. డ్యూ కూడా ప్రభావం చూపింది. మొదటి ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ B అమల్లో ఉండాలి. కానీ మా వద్ద ప్లాన్ బీ లేదని చెప్పాడు. నేను, శుభ్‌మన్‌ గిల్‌ మంచి స్టార్ట్ ఇవ్వాల్సింది. అభిషేక్‌ శర్మపైనే ఎక్కువ ఆధారపడకూడదు. అతడికీ ఆఫ్ డే ఉండొచ్చు. గిల్‌ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. అప్పుడు నేను బాధ్యత తీసుకుని నిలవాలి. నేను క్రీజులో ఉంటే మ్యాచ్ మార్చే అవకాశం ఉండేది, కానీ అది జరగలేదని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాట్లాడుతూ గత మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ బాగా ఆడాడు. ఇటీవల టెస్టుల్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు.

Details

వచ్చే మ్యాచులో మరింత మెరుగ్గా ఆడుతాం

అదే నమ్మకంతో ఈ మ్యాచ్‌లోనూ అతడిని ముందుకు పంపాం. అయితే ఈసారి ప్లాన్ పనిచేయలేదు. అయినా అక్షర్ బాగా ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్‌ ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఆడి 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం జట్టు కొత్త ప్లాన్లను సాధించే ప్రయత్నంలో ఉందని, ఈ మ్యాచ్‌ ఒక కీలక గుణపాఠమని తెలిపాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ని చూసి నేర్చుకున్నాం. వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతామని సూర్యకుమార్ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement