T20 World Cup:మరో 2 రోజుల్లో టీ20 ప్రపంచకప్.. ఏ గ్రూపులో ఏముంది?
ఈ వార్తాకథనం ఏంటి
మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా! గ్రూప్-ఏ: భారత్,పాకిస్థాన్,నమీబియా,నెదర్లాండ్స్, అమెరికా ఈ గ్రూప్‌లో టీమిండియా స్పష్టమైన ఫేవరెట్. ఇప్పుడు పాకిస్థాన్ వాకోవర్ ఇవ్వడంతో కనీస పోటీ కూడా లేకుండా పోయింది నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్ల నుంచి పెద్దగా పోటీ ఎదురయ్యే అవకాశం లేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. వన్డే, టీ20లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న భారత్.. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌ను 4-1తో గెలిచి, ఉత్సాహంతో సమరానికి సిద్ధమవుతోంది. రెండు పాయింట్లతో టోర్నీలో అడుగుపెడుతున్న రెండు సార్లు ఛాంపియన్ భారత్.. అగ్రస్థానంతో సూపర్ ఎయిట్స్‌కు చేరడం లాంఛనమే.
వివరాలు
రెండో స్థానం కోసం పోటీ ఆసక్తికరం
రెండో స్థానం కోసం పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక మ్యాచ్‌ను వదులుకున్నా, పాకిస్థాన్ ముందంజకు ఎక్కువ అవకాశలున్నాయి. అమెరికా గత ప్రపంచకప్‌లో పాక్‌కు షాక్ ఇచ్చి, తనదైన రోజు ఎలాంటి జట్టునైనా ఇబ్బంది పెట్టగలనని నిరూపించుకుంది. నమీబియా నాలుగోసారి ప్రపంచకప్ ఆడుతూ మిగతా చిన్న జట్లపై అయినా నెగ్గి ఉనికిని చాటుకోవాలనుకుంటోంది నెదర్లాండ్స్ రెండు సార్లు రెండో రౌండ్లో అడుగుపెట్టగలిగింది. ఆ జట్టును మరీ తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకిచ్చింది.
వివరాలు
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే
ఈ గ్రూపులో కచ్చితంగా ఆస్ట్రేలియానే టాప్ జట్టు అనడంలో సందేహం లేదు. ఇటీవల పాకిస్థాన్‌లో ఆ జట్టు క్లీన్‌స్వీప్ అయ్యుండొచ్చు.కానీ ఐసీసీ టోర్నీ అనగానే.. ఫామ్ ఆధారంగా కాకుండా,ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఆ జట్టుకు అలవాటే. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని కంగారూలు గ్రూప్‌లో అధిక ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో శ్రీలంక నుంచి ఆ జట్టుకు ముప్పు పొంచి ఉంది. సొంత గడ్డపై ఆడటం,హసరంగ్ వంటి స్పిన్నర్లు,ధాటిగా ఆడగల బ్యాటర్లు ఉన్న కారణంగా,శ్రీలంక గట్టి పోటీ ఇవ్వవచ్చు. బిగ్ జట్లను తప్పించుకున్నా,జింబాబ్వే,ఐర్లాండ్, ఒమన్ వంటి జట్లు సంచలనాలు సృష్టించగలవు. 2022లో జింబాబ్వే పాక్, ఐర్లాండ్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చింది. 2016లో ఒమన్ ఐర్లాండ్ ఓడించింది. కాబట్టి ఈ గ్రూప్‌ను తేలికగా చూడరాదు.
వివరాలు
గ్రూప్-సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్
గత ఛాంపియన్లతో గ్రూప్-సి ఆసక్తికరంగా ఉంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ ప్రధాన జట్లు. ఇంగ్లాండ్ ఇటీవల శ్రీలంకలో 3-0తో క్లీన్‌స్వీప్ చేసుకుని, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లపై సిరీస్‌లు గెల్చింది. సూపర్ ఎయిట్స్‌కి చేరే అవకాశం ఎక్కువ. వెస్టిండీస్ గత మూడు సిరీస్‌ల్లో ఓడిపోయినప్పటికీ, రెండో జట్టు ముందంజ కోసం ఆడే అవకాశం ఉంది. స్కాట్లాండ్, నేపాల్ చిన్న జట్లు కానీ, సంచలనాలు సృష్టించగలవు. నేపాల్ ఇటీవలి 24 టీ20లో 16 మ్యాచ్‌లు గెల్చి, వెస్టిండీస్‌ను కూడా ఓ సిరీస్‌లో ఓడించింది. ఇక తొలిసారి ప్రపంచకప్ ఆడుతోన్న ఇటలీ.. కనీస పోటీ ఇచ్చినా గొప్పే.
వివరాలు
గ్రూప్-డి: అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, UAE
'డి' గ్రూప్ అత్యంత ప్రమాదకరం. రెండు బలమైన జట్లు మాత్రమే పరిమితం కాదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఇక్కడ బరిలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా గత టోర్నీలో రన్నరప్, చివరి సిరీస్‌లో వెస్టిండీస్‌పై 2-1తో విజయం సాధించింది. న్యూజిలాండ్ ICC టోర్నీల్లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. అఫ్గానిస్థాన్ తనదైన రోజున ఏ జట్టినైనా ఓడించగలదు. గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లను ఓడించడం విశేషం. కెనడా, UAE రాణిస్తాయా అనేది చూడవలసి ఉంది.