Loading...
ICC Chairman Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఎన్నిక.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఎన్నిక.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు

ICC Chairman Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఎన్నిక.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఛైర్మన్‌గా జై షా రెండోసారి నియమితులయ్యారు. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జై షా డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగడం తనకు గౌరవంతోపాటు బాధ్యత అని పేర్కొన్నారు.

వివరాలు

ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనంపై జై షా ఏమన్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాల కోసం సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని జై షా వెల్లడించారు. క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన దశలోకి అడుగుపెడుతున్నామని అన్నారు.

2028 లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

ఒలింపిక్స్ వేదికగా కొత్త ప్రేక్షకులకు క్రికెట్‌ను ఘనంగా పరిచయం చేద్దామని జై షా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

ADVERTISEMENT