
Handshake Row:పైక్రాఫ్ట్ మాకొద్దు.. మరోసారి ఐసీసీ తలుపు తట్టిన పీసీబీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ వివాదం (Handshake Row) చెలరేగిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు చేతులు కలపకపోవడంపై పాకిస్థాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఒక దశలో టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేసిన పాక్, ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే తాజాగా మరోసారి ఐసీసీకి లేఖ రాసింది.
Details
రిఫరీపై పాకిస్థాన్ డిమాండ్
భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఇకపై పాక్ మ్యాచ్‌లకు అతడిని రిఫరీగా నియమించవద్దని కోరింది. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌కు పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్సన్‌ను రిఫరీగా పెట్టాలని అభ్యర్థించింది. అయితే ఐసీసీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు జరగబోయే పాక్ మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించనున్నారు.
Details
భారత్ ఆటగాళ్ల వైఖరిపై ఆగ్రహం
గత ఆదివారం భారత్-పాక్ మ్యాచ్‌లో, టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు హ్యాండ్‌షేక్ ఇవ్వలేదు. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకుండా మైదానం విడిచిపెట్టారు. ఈ ప్రవర్తనపై పాక్ తీవ్ర నిరసన తెలిపింది. బీసీసీఐ ఆదేశాల మేరకే రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అలా ప్రవర్తించాడని పాక్ టీమ్ డైరెక్టర్ నవీద్ ఆక్రమ్ చీమా ఆరోపించారు.
Details
సూర్యకుమార్ స్పష్టీకరణ
ఇక, పెహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచే సంకేతంగానే పాక్ ఆటగాళ్లతో చేతులు కలపలేదని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టంచేశారు.