
Surya kumar yadav: పాక్‌తో ఫైనల్‌కు ముందు సూర్యకుమార్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్‌కు ముందు సూపర్-4లో టీమిండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు చేరడంతో, ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. ఫైనల్‌కు సన్నద్ధతగా భావించిన ఈ పోరులో శ్రీలంక నుంచి చక్కటి ప్రతిఘటన ఎదురైంది. ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత జట్టుకు పెద్ద పోటీ కనిపించకపోవడమే, ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా నిలువరించింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఓవర్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు విజయం అందించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తన సహచరులపై ప్రశంసలు కురిపిస్తూ, ఫైనల్‌కు సన్నద్ధతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Details
శ్రీలంకతో మ్యాచ్ ఫైనల్ గా భావించా
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ శ్రీలంకతో మ్యాచ్‌ను నేను ఫైనల్‌గానే భావించాను. రెండో ఇన్నింగ్స్ సగం ముగిసిన తర్వాత మావాళ్ల ప్రదర్శన అద్భుతం. సెమీఫైనల్‌గా ఆడినా, జోష్‌తో మ్యాచ్‌ను విజయవంతం చేశాం. బ్యాటింగ్‌లో మంచి ప్రారంభం తరువాత, మిడిల్‌లో తిలక్ వర్మ, సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సత్తా తెలిసింది. గత మూడు ఏళ్లుగా అతను టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో కూడా అదరగొట్టాడు. అతడికంటే మరెవరు సూపర్ ఓవర్ వేయగలరు. కొందరు మావాళ్లు కండరాలు పట్టేయడం వలన ఇబ్బందిపడ్డారు, కానీ ఫైనల్‌కు సిద్ధంగా ఉంటారని నమ్ముతున్నాను. మా కుర్రాళ్ల నుండి ఒకే కోరిక: ప్రణాళికను అనుసరిస్తూ, స్పష్టతతో, నిర్భయంగా ఆడితే విజయం మనదేనని చెప్పాడు.
details
దునిత్ వెల్లలాగే కు పరామర్శ
మరోవైపు, శ్రీలంక యువ ఆటగాడు దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ గుండెపోటు కారణంగా మృతి చెందాడు. ఈ సమయంలో ఆసియా కప్‌లో ఉన్నా, దునిత్ వెంటనే జట్టుతో చేరాడు. భారత్‌తో మ్యాచ్‌లో అతడు బెంచ్‌కి పరిమితమయ్యాడు. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ దునిత్‌ను ఓదారుస్తున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయింది.