LOADING...
T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్
మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్

T20 World Cup: మరో 4 రోజుల్లో ప్ర్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కప్పులందు ప్రపంచకప్‌ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది. రోహిత్ సేన బ్రిడ్జ్‌టౌన్‌లో చరిత్రాత్మకమైన విజయంతో కప్పును సొంతం చేసుకున్న ఆ క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతుండగానే.. ఇప్పుడు మరో ప్రపంచకప్‌ రాబోతోంది. ఈసారి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వబోయేది భారతే కావడం విశేషం. కొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనూ జరుగనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగే భారత జట్టు, పూర్వపు ఫార్మ్‌ని కొనసాగిస్తూ, టోర్నీలో అడుగుపెట్టింది. 2024 టీ20 ప్రపంచకప్‌ గెలిచాక ఈ ఫార్మాట్లో భారత జట్టు ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.

వివరాలు 

20 జట్లతో పొట్టి ప్రపంచకప్

దీంతో సూర్యకుమార్‌ సేనపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి జట్లు కూడా బలంగా ఉన్నాయి. కిందటిసారి లాగే ఈసారి కూడా అత్యధికంగా 20 జట్లతో పొట్టి ప్రపంచకప్‌ జరగబోతోంది. తొలిసారిగా బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగట్లేదన్న సంగతి తెలిసిందే. అయినా ఈ టోర్నీపై క్రికెట్‌ ప్రేమికుల్లో ఆసక్తి ఏమీ తక్కువగా లేదు. ఈ క్రీడా మహోత్సవం ఈ నెల 7న ప్రారంభమై, మార్చి 8న ఫైనల్‌తో ముగిసే టోర్నీలో మెరుపులకు లోటు లేనట్లే.

వివరాలు 

ఏ జట్టు ఏ గ్రూప్‌లో?

గ్రూప్‌-ఎ: భారత్, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌ గ్రూప్‌-సి: ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్‌ గ్రూప్‌-డి: న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, కెనడా, యూఏఈ

Advertisement

వివరాలు 

ఫార్మాట్‌ ఇలా..

20 జట్లు ఐదు ఐదు జట్లుగా నాలుగు గ్రూపులలో విభజించబడ్డాయి. ప్రతి జట్టు, తన గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత పొందుతాయి. సూపర్-8లోని 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడతాయి. ఈ రెండో గ్రూప్‌లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒకోసారి ఆడుతుంది. రెండు గ్రూపులలో టాప్ 2 జట్లు సెమీస్‌లో ప్రవేశిస్తాయి. 3 ప్రపంచకప్‌ను అత్యధికంగా రెండుసార్లు గెలిచిన జట్లు. భారత్‌ 2007, 2024లో విజేతగా నిలవగా.. విండీస్‌ 2012, 2016లో ఛాంపియన్‌ అయింది. ఇంగ్లాండ్‌ 2010, 2022లో టైటిల్‌ సాధించింది.

Advertisement

వివరాలు 

9

ఇప్పటిదాకా 9 టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి . 20 ఈసారి ప్రపంచకప్‌ బరిలో జట్లు పాల్గొంటున్నాయి. 55 ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. 1292 టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లి 1292 పరుగులు చేశాడు. అతనే టాప్‌స్కోరర్‌. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2016లో ఇక్కడ టోర్నీ నిర్వహించారు. 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం కూడా బీసీసీఐదే. కొవిడ్‌ కారణంగా టోర్నీ అప్పుడు అక్కడ జరిగింది.

Advertisement