IND Vs NZ: నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. శివమ్ దూబె ఒంటరిగా పోరాడుతూ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అతడికి కొంతమేర రింకు సింగ్ (39; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజు శాంసన్ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మద్దతుగా నిలిచారు. అయితే అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.సూర్యకుమార్ యాదవ్ (8),హార్దిక్ పాండ్య (2) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీసి కీలకంగా మారాడు.
వివరాలు
భారత బౌలర్లకు చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్లు
జాకబ్ డఫీ, ఇష్ సోధి చెరో 2 వికెట్లు పడగొట్టగా, మ్యాట్ హెన్రీ, జాక్ ఫౌక్స్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సిఫెర్ట్, డెవాన్ కాన్వే బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. సిఫెర్ట్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేయగా, కాన్వే 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు సాధించాడు. ఈ జోడీ తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
వివరాలు
స్కోరును భారీగా పెంచిన డారిల్ మిచెల్
చివర్లో డారిల్ మిచెల్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 39 పరుగులు చేసి స్కోరును భారీగా పెంచాడు. గ్లెన్ ఫిలిప్స్ (24), జాక్ ఫౌక్స్ (13), మిచెల్ శాంట్నర్ (11) కూడా ఉపయోగకరమైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు.