LOADING...
T20 World Cup: భారత్ వరల్డ్‌కప్ విజయం.. పలువురు ఆటగాళ్లు రెండోసారి..
భారత్ వరల్డ్‌కప్ విజయం.. పలువురు ఆటగాళ్లు రెండోసారి..

T20 World Cup: భారత్ వరల్డ్‌కప్ విజయం.. పలువురు ఆటగాళ్లు రెండోసారి..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులోని 9 మంది ఆటగాళ్లు ఈసారి కూడా విజేత జట్టులో చోటు దక్కించుకుని తమ కెరీర్‌లో రెండోసారి టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్,శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లకు ఇది రెండో టీ20 వరల్డ్‌కప్ విజయంగా నిలిచింది. మరోవైపు ఇషాన్ కిషన్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలకు ఇది కెరీర్‌లో తొలి వరల్డ్‌కప్ విజయం కావడం విశేషం. 2024లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు కూడా ఇది ప్రత్యేకమైన ఘనతగా నిలిచింది.

వివరాలు 

పురుషుల దినోత్సవాన చేజారింది... మహిళల దినోత్సవాన దక్కింది...

ఎందుకంటే 2007లో భారత్ గెలిచిన తొలి టీ20 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు కెప్టెన్‌గా మరోసారి కప్ గెలిచి 'డబుల్' ఆనందాన్ని ఆస్వాదించాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలై తీవ్ర నిరాశను ఎదుర్కొంది. అదే రోజు ప్రపంచవ్యాప్తంగా 'మెన్స్ డే'గా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు అదే అహ్మదాబాద్ మైదానంలో జరిగిన మరో వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది. విశేషం ఏమిటంటే ఈ ఘన విజయం 'ఉమెన్స్ డే' అయిన మార్చి 8న రావడం.

వివరాలు 

ఎట్టకేలకు ఆదివారం 'గెలిచాం'

ఇంతకుముందు ఆదివారం జరిగిన మూడు వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. కానీ నాలుగోసారి మాత్రం ఆ 'సండే ఫైనల్ సెంటిమెంట్'ను చెరిపేసింది. ఆదివారం జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో తొలిసారి భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం చవిచూసింది.

Advertisement

వివరాలు 

2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి 

2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో కూడా మళ్లీ ఆస్ట్రేలియానే టీమిండియాను ఓడించింది. అయితే ఈసారి మాత్రం భారత్ ప్రత్యర్థిని పూర్తిగా అధిగమించి ఆదివారం జరిగిన ఫైనల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. గతంలో భారత్ గెలిచిన 1983, 2011 వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ శనివారం రోజున లభించగా, 2007 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సోమవారం రోజున వచ్చింది. ఇక 2024 టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కూడా శనివారం రోజునే భారత్ సొంతం చేసుకుంది.

Advertisement