LOADING...
AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. 3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. 3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. 3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ పరీక్షలు నేటి నుంచి, (సోమవారం మార్చి 16 నుంచి) ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ 3,415 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే వారిలో 6,22,074 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 18,842 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

పరీక్షా హాల్‌లో వీటికి అనుమతి లేదు 

పరీక్షల నిర్వహణ ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 38,958 మంది ఇన్విజిలేటర్లను విధుల్లో నియమించారు. మాల్ ప్రాక్టీస్‌ను పూర్తిగా అడ్డుకునే దిశగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. అదనంగా, 210 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే పరీక్షా హాల్‌లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని విద్యాశాఖ వెల్లడించింది.

Advertisement