LOADING...
Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్
సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్

Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
07:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆటగాళ్లతో సూర్య ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తాడని, అదే పొట్టి ఫార్మాట్‌లో తనకు కోచ్‌గా పని చేయడం మరింత సులభంగా మారిందని గంభీర్ పేర్కొన్నాడు. బ్యాటర్‌గా తనదైన శైలిలో వినూత్న షాట్లతో ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చే సూర్య, కెప్టెన్‌గా కూడా అదే స్థాయిలో రాణిస్తున్నాడని తెలిపాడు. సహచరులతో మంచి అనుబంధం ఉంచుకుంటూ, వారితో స్పష్టంగా మాట్లాడతాడని, మైదానంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఆటగాళ్లకు ధైర్యం ఇస్తున్నాడని గంభీర్ వివరించాడు.

వివరాలు 

జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు

జట్టులో సానుకూల వాతావరణాన్ని నిలబెట్టడంలో సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడని, అందువల్ల తన బాధ్యతలు మరింత తేలికవుతున్నాయని అన్నారు. ఆటగాడిగా అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కెప్టెన్‌గా అన్ని అంశాల్లో సూర్య పూర్తి సామర్థ్యాన్ని చూపిస్తున్నాడని, ఇలాంటి నాయకుడు భారత జట్టును నడిపించడం గర్వకారణమని గంభీర్ ప్రశంసించాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు సూర్యకుమార్ యాదవ్ అని స్పష్టం చేశాడు.

వివరాలు 

సూర్య ఎదురుదాడి

ఇదిలా ఉండగా,టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పోరులో సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒక దశలో భారత్ 13 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి కేవలం 77 పరుగులకే పరిమితమై తీవ్ర ఒత్తిడిలో పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్య ఎదురుదాడికి దిగుతూ భారీ షాట్లతో స్కోరును ముందుకు నడిపించాడు. అతడి ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో యూఎస్‌ఏ 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమవడంతో భారత్ విజయం ఖరారైంది.

Advertisement