Loading...
Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్‌లు స్వాధీనం!
అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్‌లు స్వాధీనం!

Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్‌లు స్వాధీనం!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి. భారత్‌తో పాటు చైనా,పాకిస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమారు 4,500 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్‌లో ఓ కంపెనీ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరుతో ఓ సందేశం వచ్చింది. అది నిజమైనదేనని భావించిన ఉద్యోగి,సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు ఏకంగా రూ.1.5 కోట్లు బదిలీ చేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

రూ.1.3కోట్లను రికవరీ చేసిన పోలీసులు

వేగంగా స్పందించిన పోలీసులు రూ.1.3కోట్లను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు.

కేసును మరింత లోతుగా విచారించిన పోలీసులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ అలీ పియాదా, ఇంజాముల్ అనే ఇద్దరు వ్యక్తుల ప్రమేయాన్ని గుర్తించారు.

అనంతరం వారిని ట్రాన్సిట్ వారెంట్లపై గుజరాత్‌కు తీసుకువచ్చి విచారించారు.

వారి నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులు, సాంకేతిక పరికరాలు లభించడంతో దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి మొత్తం 4,500సిమ్ కార్డులు,ఒకేసారి అనేక సిమ్ కార్డులను యాక్టివ్‌గా ఉంచేందుకు ఉపయోగించే పరికరాలు, మొబైల్ ఫోన్లు,రూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్, ఈ-కామర్స్ యాప్‌ల కోసం ఓటీపీలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

వివరాలు 

నేరాలకు చైనాలో తయారైన మాల్‌వేర్, పాకిస్థాన్‌లోని కాల్ సెంటర్ వినియోగం

ఇప్పటివరకు సుమారు 21,000 ఓటీపీలను అందించి, రూ.21 లక్షలకు పైగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.

సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన సమయంలో మరో కీలక విషయం బయటపడింది.

చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు రూపొందించిన మాల్‌వేర్‌ను ఈ మోసాలకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

అంతేకాకుండా ఈ ఆపరేషన్‌కు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న ఓ కాల్ సెంటర్‌తో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

చైనా ఆధారిత వీపీఎన్ సేవలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

గత నాలుగేళ్లుగా పాక్, చైనాకు 'సైబర్‌క్రైమ్ యాజ్ ఎ సర్వీస్' అందిస్తున్న ముఠా

ఈ ముఠా గత నాలుగైదేళ్లుగా పాకిస్థాన్,చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లకు డమ్మీ సిమ్ కార్డులు, ఓటీపీలు,వాట్సాప్ ఖాతాలను అందిస్తూ 'సైబర్‌క్రైమ్ యాజ్ ఎ సర్వీస్'తరహాలో సేవలు అందిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ తెలిపారు.

అంటే సైబర్ నేరాలకు అవసరమైన వనరులను ఇతర నేరగాళ్లకు సమకూర్చే విధంగా ఈ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు,స్వాధీనం చేసుకున్న సిమ్ కార్డులకు దేశవ్యాప్తంగా 26రాష్ట్రాల్లో నమోదైన 251సైబర్ క్రైమ్ ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

దీంతో ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలు మరింత విస్తృతంగా ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

నిందితుల వెనుక ఉన్న ఇతర వ్యక్తులు,అంతర్జాతీయ లింకులు,మరిన్ని సైబర్ నేరాల్లో వారి పాత్రపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT