LOADING...
Suryakumar Yadav: వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. నమీబియాను ప్రశంసించిన సూర్యకుమార్
వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. నమీబియాను ప్రశంసించిన సూర్యకుమార్

Suryakumar Yadav: వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. నమీబియాను ప్రశంసించిన సూర్యకుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2026
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఢిల్లీలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (61), హర్ధిక్ పాండ్యా (52) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడడంతో భారత్ 209 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు, పిచ్ అనుకున్నంత సులభంగా లేదని పేర్కొన్నాడు. అలాగే నమీబియా బౌలర్లు ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఇది అందరికీ మంచి మ్యాచ్. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తే పరుగులు సులభంగా వస్తాయని అనిపిస్తుంది.

Details

నమీబియా బౌలర్లకు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి

అయితే త్వరత్వరగా రెండు, మూడు వికెట్లు కోల్పోయాం. ఆ తర్వాత శివమ్ దూబే, హార్దిక్ పాండ్యల మధ్య 39 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం మాకు బలమైన స్థితిని ఇచ్చింది. బంతి కాస్త ఆగి బ్యాట్‌పైకి వస్తోంది. అయినప్పటికీ నమీబియా బౌలర్లకు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. వారు కసితో వచ్చి తమ ప్రణాళికలను సమర్థంగా అమలు చేశారు. వారి బౌలింగ్ నిజంగా ఆకట్టుకుందని సూర్యకుమార్ చెప్పాడు.

Details

బుమ్రా రాణించడం శుభసూచకం

అలాగే జస్పిత్ బుమ్రా బౌలింగ్‌పై కూడా సూర్య స్పందించాడు. మేం తొలుత కొన్ని వికెట్లు కోల్పోయినా, మధ్యలో భాగస్వామ్యం వల్ల మంచి ముగింపు ఇవ్వగలిగాం. బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేయడం శుభ సూచకం. తదుపరి మ్యాచ్‌కు అతను పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ తో కలిసి, వరుణ్ చక్రవర్తి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ కాంబినేషన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు నిజంగా కష్టమే" అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

Advertisement