LOADING...
Shoaib Akhtar: భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్
భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్

Shoaib Akhtar: భార‌త్ టీ20 వ‌రల్డ్ క‌ప్ గెల‌వాలంటే ఆ ప్లేయ‌ర్ కీల‌కం : షోయబ్ అక్తర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్‌-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా భారత జట్టు ఈ ప్రపంచకప్‌లో బరిలోకి దిగనుంది. అత్యుత్తమ టీ20 ఆటగాళ్లు జట్టులో ఉండటంతో అందరి దృష్టి భారత్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ జట్టులో యువ బ్యాట్స్‌మన్‌ అభిషేక్‌ శర్మ ఒకరు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు అతను పీడకలగా మారుతున్నాడు. అయితే, పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయం ప్రకారం భారత జట్టులో అసలైన గేమ్‌ ఛేంజర్‌ అభిషేక్‌ శర్మ కాదని తెలిపారు. అభిషేక్‌ టీ20 జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారి, తన దూకుడైన ఆటతో భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.

Details

అసలైన గేమ్‌ ఛేంజర్‌ సూర్యకుమార్‌ యాదవ్

అయినప్పటికీ, అక్తర్‌ మాత్రం భారత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌నే అసలైన గేమ్‌ ఛేంజర్‌గా పేర్కొన్నారు. సూర్యకుమార్‌ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ అని, అతను బ్యాట్‌ ఝుళిపిస్తే భారత జట్టుకు అదృష్టమేనని అక్తర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సూర్యకుమార్‌ పూర్తి ఫామ్‌లో లేరన్న విమర్శలున్నాయి. అతని సత్తాపై అక్తర్‌కు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. భారతదేశంలో ప్రతిభకు కొరత లేదు. అందుకే ఈ జట్టు టైటిల్‌కు అతిపెద్ద పోటీదారు. కానీ భారత్‌ గెలవాలంటే కెప్టెన్‌ సూర్యకుమార్‌ పరుగులు సాధించాలి. భారత జట్టు టైటిల్‌ రేసులో కొనసాగాలంటే కెప్టెన్‌ స్థాయికి తగిన విధంగా పరుగులు సాధించడం అవసరమని అక్తర్‌ స్పష్టం చేశారు.

Details

ఆశించన స్థాయిలో రాణించిన సూర్య కుమార్ యాదవ్

టీ20లో వేగంగా పరుగులు సాధించే విషయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ప్రదర్శన కనబర్చడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సూర్యకుమార్‌ టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని ఆటలో స్థిరత్వం కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్ని సిరీస్‌లలో అతను పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశపరిచాడు. సూర్య కెప్టెన్సీలో జట్టు మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ, అతని వ్యక్తిగత బ్యాటింగ్‌ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయావకాశాలు పెరగాలంటే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌తో రాణించడం కీలకంగా మారింది.

Advertisement