Delhi: భారీ ఉగ్రకుట్ర భగ్నం: 300 కేజీల ఆర్డీఎక్స్,AK-47 స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ పోలీసులు ఒక పెద్ద ఉగ్ర కుట్రను ఛేదించారు. ఇటీవల అనంతనాగ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ ఆదిల్ అహ్మద్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసిన సమయంలో అతని లాకర్‌లో నుంచి ఏకే-47 తుపాకీ బయటపడింది. అనంతరం అతడిని ప్రశ్నించగా, అందిన ఆధారాల మేరకు పోలీసులు దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న ఫరీదాబాద్‌లో శోధనలు నిర్వహించారు. అక్కడ భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సుమారు 300 కిలోల ఆర్‌డీఎక్స్, ఒక ఏకే-47 తుపాకీతో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
300 కేజీల ఆర్డీఎక్స్,AK-47 స్వాధీనం
Plot to cause multiple Delhi blasts foiled.
— IndiaToday (@IndiaToday) November 10, 2025
J&K Police recover 300 kg of RDX, an AK-47 rifle, and ammunition from #Faridabad based on disclosures by arrested doctor. India Today's @kamaljitsandhu with more details.#Delhi #JammuandKashmir #ITVideo @anchorAnjaliP pic.twitter.com/jMCR65y9Aw