LOADING...
Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం
బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం

Jammu And Kashmir: బారాముల్లా రహదారిపై విరిగిపడిన కొండచరియలు.. పరుగులు తీసిన జనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతం,బారాముల్లా జిల్లాలో భారీగా కొండచరియల విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై సంభవించింది. ఘటన సమయంలో అప్రమత్తతతో ఉన్న వాహనదారులు వెంటనే ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ,ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలూ కాలేదు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ప్రస్తుతం ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున కొండచరియలు విరిగినట్లు తెలిపింది.

వివరాలు 

 బారాముల్లా-ఉరి మార్గంలో పూర్తిగా స్తంభించిన  రవాణా 

ఈ సంఘటన కారణంగా ఆ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం కొండపై నుంచి బండరాళ్లు కిందకు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఆ హైవేపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా, బారాముల్లా-ఉరి మార్గంలోని రవాణా పూర్తిగా స్తంభించినట్లు వెల్లడించబడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

Advertisement